బెంగళూర్ చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంకలో జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ సత్తా చాటింది. పింక్ బాల్ టెస్ట్ లో భారత బౌలర్లు తక్కువ స్కోర్ కే శ్రీలంకను పరిమితం చేశారు. కేవలం 109 పరుగులకే శ్రీలంక ఆల్ అవుట్ అయింది. దీంతో ఇండియా 143 పరుగుల కీలక ఆధిక్యాన్ని సంపాదించింది. బూమ్రా 5 వికెట్లు తీసుకుని శ్రీలంకను కోలుకోలేని దెబ్బ తీశాడు. బూమ్రాతో పాటు అశ్విన్, షమీ చెరో రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటెల్ ఒక వికెట్ పడగొట్టాడు. టీమిండియా బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లలో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. శ్రీలంక బ్యాటర్లలో మాథ్యూస్ మాత్రమే 43 పరుగులు చేశారు. డిక్వెల్లా 21 పరుగులు సాధించాడు.
అంతకు ముందు ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటర్లు కూడా పెద్దగా రాణించలేదు. కేవలం శ్రేయాస్ అయ్యర్ మాత్రమే చెప్పుకోదగిన స్కోర్ చేశారు. శ్రేయాస్ అయ్యర్ 92, పంత్ 39, హనుమ విహారి 31 స్కోర్ చేయడంతో టీమిండియా 252 పరుగులకు ఆలౌట్ అయింది.