టీమిండియా వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా విక్టరీ సాధించింది. చివర్లో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ దంచికొట్టడంతో టీమిండియా.. ఈ మ్యాచ్ లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అంతేకాక.. మూడు వన్డేల ఈ సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 312 పరుగుల భారీ ఛేదనలో శుభ్మన్ గిల్ 43 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 63 పరుగులు సంజూ శాంసన్ 33 పరుగులు చేసారు. అయితే.. ఆఖరి పది ఓవర్లలో జట్టు విజయానికి 100 పరుగులు అవసరమైన వేళ అక్షర్ రెచ్చిపోయి ఆడి, టీమిండియాకు విజయం అందించారు. టెయిలెండర్లతో కలిసి ఆదుకున్నారు. ఈ నేపథ్యంలోనే వన్డేల్లో తన తొలి అర్థ శతకం సాధించాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది.