ఇండియాను కుదేపిస్తున్న థర్డ్‌ వేవ్‌..ఒక్క రోజే కొత్తగా 1.41 లక్షల కరోనా కేసులు

-

ఇండియా కరోనా మహమ్మారి కేసులు రోజు రోజు విజృంభిస్తూనే ఉన్నాయి. మొన్నటి వరకు 10 వేలకు తక్కువగా నమోదు అయిన కరోనా కేసులు ఇప్పుడు… లక్ష కు పైగా నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,41,986 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,53,68,312 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 4,72,169 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.36 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 285 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,83,178 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 40,895 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,44,12,740 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 150.06 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 90,59,360 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

https://twitter.com/ANI/status/1479664280093872130?s=20

Read more RELATED
Recommended to you

Exit mobile version