Breaking : ఇండియాలో కరోనా విలయ తాండవం..కొత్తగా 20,038 కేసులు

-

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. గడిచిన 24గంటల్లో 20,038 మంది కరోనా సోకింది. తాజా కేసులతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 4.56 కోట్ల మంది కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసులు 4,37,10,027కు చేరాయి. ఇందులో 4,30,45,350 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,604 మంది మృతిచెందారు. మరో 1,39,073 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత కొన్నిరోజులుగా భారీగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసులు 5 నెలల తర్వాత మొదటిసారిగా గురువారం 20 వేలు దాటిన విషయం తెలిసిందే.

ఫోర్త్ వేవ్ కన్ఫర్మేనా?..రోజు రోజుకీ భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసులు |  India Reports 2451 New COVID 19 Cases In 24 Hours– News18 Telugu

గత 24 గంటల్లో 47 మంది కరోనాకు బలయ్యారని, 16,994 మంది డిశ్చార్జీ అయ్యారని వెల్లడించింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.49 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.44 శాతానికి చేరిందని పేర్కొన్నది. ఇప్పటివరకు 199.47 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది కేంద్ర ఆరోగ్య శాఖ.

 

Read more RELATED
Recommended to you

Latest news