డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముందుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాతలలో ఒకరిగా చలామణి అవుతూ..ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈయన నిర్మించే ఎన్నో చిత్రాలు కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఒక డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించే స్థాయికి ఎదిగారు అంటే ఇక ఆయన విజయం వెనుక కృషి, పట్టుదల ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే సినిమా విడుదల చేయడానికి ముందే ఆ సినిమా యొక్క విజయాన్ని , అపజయాన్ని అంచనా వేసేస్తారు. ఇకపోతే ఇటీవల ఆయన రెండోసారి తండ్రి అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక కొడుకు పుట్టడంతో ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నారు.
ఇక మొదటి భార్య అనిత చనిపోవడంతో.. తండ్రి మానసిక బాధను చూడలేక దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి తండ్రి రెండో పెళ్లి చేసుకోవడానికి అంగీకరించేలా చేసింది . దీంతో నిజామాబాద్ జిల్లాలోని నరసింగాపల్లి లో వున్న వెంకటేశ్వర స్వామి ఆలయం లో 2020 మే 10వ తేదీన దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నాడు. ఇక లాక్ డౌన్ వల్ల వీరి పెళ్లికి ఇండస్ట్రీ నుంచి ఎవరిని కూడా ఆహ్వానించలేదు. కేవలం ఇరు కుటుంబాల సన్నిహితుల మధ్య వివాహం జరిగింది. ఇకపోతే దిల్ రాజు రెండో భార్య తేజస్విని గురించి చాలామందికి తెలియదని చెప్పాలి. ఈమె ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చింది అని.. ప్రముఖ విమానయాన సంస్థలో ఎయిర్ హోస్టేస్ గా పనిచేసిందట. ఇక తొలిసారి ఫ్లైట్లో చూసి దిల్ రాజు ఈమెను ఇష్టపడ్డారు. ప్రస్తుతం ఈమె వయసు 34 సంవత్సరాలు. ఇకపోతే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారన్న ఉద్దేశంతోనే ఆమెకు సంబంధించిన అన్ని విషయాలను దిల్ రాజు గోప్యంగా ఉంచడం గమనించదగ్గ విషయం.