బిగ్ రిలీఫ్ ; ఇండియాలో కొత్తగా 7579 కరోనా కేసులు.. 543 రోజుల తర్వాత ఇదే మొదటిసారి

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న కాస్త పెరిగిన కరోనా కేసులు ఇవాళ అమాంతం తగ్గిపోయాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్… గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా… 7,579 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఒక రోజు లో ఇంత తక్కువ కరోనా కేసులు నమోదు కావడం 543 రోజుల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,26,480 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,13,584 కు చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య ఇంత తక్కువగా నమోదు కావడం 536 రోజుల అనంతరం ఇదే మొదటి సారి. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.26 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 236 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,66, 147 కి చేరింది. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,39,46,749 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,17,63,73,499 మంది కి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

https://twitter.com/ANI/status/1462989100365926403?s=20

Read more RELATED
Recommended to you

Exit mobile version