దేశంలో మళ్లీ పెరిగిన కరోనా.. ఇవాళ కొత్త 18,987 కేసులు

-

ఇండియాలో మరోసారి కరోనా కేసులు పెరిగాయి. నిన్న 15 వేలకు తక్కువగా నమోదు కాగా… ఇవాళ ఆ సంఖ్య భారీ గా పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… గడిచిన 24 గంటల్లో దేశంలో 18, 987 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,06, 586 కు చేరింది.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.07 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 19, 808 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,33,62, 709 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 96. 82 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

ఇక గడిచిన 24 గంటల్లో 32 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. అలాగే దేశంలో గడిచిన 24 గంటల్లో 13,01,083 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..మొత్తంగా ఆ సంఖ్య దేశ వ్యాప్తంగా 58,76,64,525 కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version