ప్రపంచంలో భారత్ పవర్ ఫుల్ దేశం అని అంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా యుద్ధంపై భారత్ వంటి ఓ వపర్ ఫుల్ దేశం మద్దతు ఇస్తే.. బ్రిటన్ ఏం చేయలేక పోయిందని అన్నారు. అలాంటి గొప్ప దేశం అయిన భారత్ కు తాము మద్దతు ఇవ్వడం గర్వంగా ఉందని అన్నారు. భారత్ ఒక స్వతంత్ర దేశమని.. ఆ దేశానికి ఏం చేప్పలేమని బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి అన్నారని గుర్తు చేశారు. ఇలాంటి పవర్ ఫుల్ దేశానికి తాము మద్ధతు ఇచ్చినందుకు ఎలాంటి భాద లేదని అన్నారు. భారత్ శక్తి వంతమైన దేశం అన్నారు.
కానీ తప్పు మొత్తం తమ దేశానిదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రతిపక్ష పార్టీల వల్ల.. ప్రపంచ పటంలో పాక్ బలహీన పడిందని ఆరోపించారు. కాగ తాను రష్యాకు వెళ్లినందకు అమెరికా తనపై కోపంగా ఉందని ఆరోపించారు. అందుకే తనపై ఇలాంటి కుట్రలు చేస్తుందని ఆరోపించారు.
కాగ ఇటీవల పీఎం ఇమ్రాన్ ఖాన్.. పై ప్రతిపక్ష పార్టీలు… కొన్ని మిత్ర పక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి. దీనిపై ఇమ్రాన్ ఖాన్.. తనపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి కారణం అమెరికా తో పాటు ఆ దేశ మిత్ర దేశాల హస్తం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు.