రెండో టీ20లో భారత్ జయకేతనం… మరో మ్యాచ్ మిగిలిఉండగానే సిరీస్ కైవసం

-

న్యూజీలాండ్ తో జరిగిన రెండో టీ 20లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ చెలరేగి ఆడటంతో భారత్ లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. మరో టీ20 మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్ ను సొంతం చేసుకుంది. రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టీ 20 మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ విధించిన 153 పరుగుల టార్గెట్‌‌ను సునాయసనంగా చేధించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన కేఎల్‌ రాహుల్, రోహిత్‌ శర్మ మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా కేఎల్‌ రాహుల్‌ 49 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 36 బంతుల్లో 1 ఫోర్లు 5 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ 3 వికెట్లు సాధించాడు. మిగతా వారు ఎవ్వరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీం 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 154 పరుగుల టార్గెట్‌‌ను ఉంచగలిగింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మార్టిన్ గప్టిల్ 31 (15 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సులు), డారెల్ మిచెల్ 31(28 బంతులు, 3 ఫోర్లు ) మంచి శుభారంబాన్నిచ్చారు. అనంతరం గ్లెన్‌ ఫిలిప్స్‌ 21 బంతుల్లో 34 పరుగులు చేశాడు. చాప్‌మన్‌ 21 పరుగులు మినహాయించి పెద్దగా ఎవ్వరూ రాణించలేదు. దీంతో కివీస్‌ కనీసం పోరాడే స్కోర్‌ను సాధించింది. ఇక టీమిండియా బౌలర్లలో హర్షల్ పటేల్‌ 2 వికెట్లు, భువనేశ్వర్, అశ్విన్, చాహర్, అక్సర్ పటేల్‌ తలా ఒక వికెట్ పడగొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news