మొదలైన నాలుగో రోజు ఆట.. బరిలోకి దిగిన రోహిత్, రాహుల్..

-

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ మరియు ఇండియా మధ్య రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ నాలుగవ రోజు కాసేపటి క్రితమే… ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇక ప్రస్తుతం 2-0 పరుగులతో ఇండియా బ్యాట్స్ మెన్స్ రోహిత్ శర్మ మరియు కె.ఎల్.రాహుల్ క్రీజ్ లో ఉన్నారు.

ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు… 391 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్ లో ఆల్ అవుట్ అయింది. దీంతో టీమిండియా పై 27 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది ఇంగ్లాండ్ టీం. ఇక ఈ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లలో… కెప్టెన్ జో రూట్ 180 పరుగులతో రాణించగా… బేర్ స్టో 57 పరుగులు మరియు బర్న్స్ 49 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు.  ఇక టీమిండియా బౌలర్లు లో మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టగా ఈ శాంతి శర్మ 3 మరియు మహమ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టారు. కాగా టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 364 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version