సిరీస్‌ గెలిచిన టీమిండియా.. పంత్‌ సూపర్‌ సెంచరీ

-

ఇంగ్లండ్ తో చివరి వన్డేలో ఘనవిజయం సాధించింది టీమిండియా . పంత్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. టీమిండియా మరో 47 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. పంత్ కు వన్డేల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. 16 ఫోర్లు, 2 సిక్సులతో 113 బంతుల్లో 125 పరుగులతో అజేయంగా నిలిచాడు పంత్. పంత్ సెంచరీ సాయంతో టీమిండియా 42.1 ఓవర్లలో 5 వికెట్లకు 261 పరుగులు చేసి మ్యాచ్ లో విజయాన్ని, తద్వారా 2-1తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. 260 పరుగుల లక్ష్యఛేదనలో ఓ దశలో టీమిండియా టాపార్డర్ చేతులెత్తేసినా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాతో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.

పిచ్ బ్యాటింగ్ కు ఏమాత్రం సహకరించకపోయినా, ఏ దశలోనూ ఒత్తిడికి లోనుకాకుండా పని ముగించాడు. చివర్లో డేవిడ్ విల్లీ విసిరిన ఓవర్లో పంత్ వరుసగా 5 ఫోర్లు కొట్టడం హైలైట్ గా నిలిచింది. పాండ్యా 55 బంతుల్లో 10 ఫోర్లతో 77 పరుగులు చేశాడు. పాండ్యా అవుటైన తర్వాత రవీంద్ర జడేజా బరిలో దిగాడు. అతడు కూడా పరిస్థితికి తగ్గట్టుగా ఆడగా, మరో ఎండ్ లో పంత్ విజృంభించాడు. దాంతో టీమిండియా సునాయాసంగా గెలుపు తీరాలకు చేరింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version