India TV సర్వే : లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయంటే !

-

2024 లో లోక్‌ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే సర్వే సంస్థలు.. నియోజక వర్గాలు సర్వేలు మొదలు పెట్టేశాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి కిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌ పార్టీనే విజయం సాధిస్తుందని సర్వేలు చెప్పేశాయి.

అలాగే బీజేపీ పార్టీ పుంజుకుంటుందని పేర్కొన్నాయి సర్వేలు. ఈ నేపథ్యంలో.. తాజాగా ఇప్పటి కిప్పుడు లోక్‌ సభ ఎన్నికలు జరిగితే, టీఆర్‌ఎస్‌, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై నేషనల్‌ మీడియా అయిన ఇండియా టీవీ సర్వే నిర్వహించింది.

ఈ సర్వే ప్రకారం.. లోక్‌ సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ 8 ఎంపీలు, బీజేపీ 6 ఎంపీలు, కాంగ్రెస్‌ 2, ఎంఐఎం 1 ఎంపీ గెలు కోనున్నట్లు సర్వేలు తేల్చేసాయి. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో వైసిపికి 19 ఎంపీ సీట్లు, టీడీపీకి 6 సీట్లు వస్తాయని డియా టీవీ సర్వే తేల్చి చెప్పింది. ఇక కేంద్రంలో మరోసారి బీజేపీ పార్టీనే అధికారంలోకి వస్తుందని స్పస్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news