జబర్దస్త్ కామెడీ షో 2013 నుండి దాదాపుగా 10 సంవత్సరాలుగా అద్వితీయంగా నడుస్తున్న పాపులర్ షో. నాగ బాబు , రోజాలు జడ్జిలుగా ఉంటూ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ షో ద్వారా ఎంతో మంది కొత్త ఆర్టిస్టులు పరిచయమయ్యారు. మారుమూల పల్లెల నుండి వచ్చే వారికి తమ ట్యాలెంటును నిరూపించుకునేందుకు మంచి వేదికగా నిలిచింది. కమెడియన్ వేణు, ధన్ రాజ్, అభి, హైపర్ ఆది, సుధీర్, గెటప్ శ్రీను లాంటి ఎందరో కమెడియన్స్ ఈ షో ద్వారానే పాపులర్ అయ్యారు.
కొత్త నీరు రావడం , పాత నీరు పోవడం ఏ రంగంలోనైనా సహజమే అదే క్రమంలో సీనియర్లకు మంచి అవకాశాలు రావడం కొత్తవారికి చోటు దక్కింది. ఇక నాగబాబు , రోజాలు జబర్దస్తను వీడిన తరువాత సింగర్ మనో, సీనియర్ నటి ఇంద్రజ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. మొన్నటివరకు శ్రీదేవి డ్రామా కంపెనీలో జడ్జీ గా వ్యవహరించిన ఇంద్రజ ఇప్పుడు ఈ షోకు మారిపోయింది.
ఈ మద్య కాలంలో జబర్దస్త్ టీఆర్‌పీ తగ్గుతుంది, షోలో అడల్ట్ కంటెంట్, బాడీ షేమింగ్ ఎక్కువైపోయాయి. ఇదే విషయమై ఇంద్రజ ఒక ఇంటర్వ్యూలో స్పందించింది. ఒక షో టీఆర్‌పీ పెరగడం తగ్గడం అనేది కామన్, పది సంవత్సరాల నుండి నడుస్తుండం ఎంత గొప్ప విషయమో చెప్పనవసరం లేదంది. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్న క్రమంలో టీఆర్‌పీలలో పెరుగుదల, తగ్గుదల అనేవి సహజమేనంటూ తెలిపింది.
జబర్దస్త్ షో చూసేవారు చూస్తున్నారు, ఇంకా పెరుగుతున్నారు. అడల్ట్ కంటెంట్, బాడీ షేమింగ్ అనేవి ఎవరైనా ఒక్కరు బాగాలేదని చెబితే ఒకరి నుండి ఇంకొకరు అదే కోణంలో చూస్తూ నిజంగా బాగాలేదేమో అనే రూమర్స్ వస్తాయి. మెండ్‌లో ఏదీ లేకుండా రిఫ్రెషింగ్ లుక్‌తో జబర్‌దస్త్ షోను చూసేవారికి అలాంటివి అనిపించడం లేదు. అవి కేవలం ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చెయ్యడం కోసం మాత్రమే ఉపయోగిస్తున్నాము. ఎవరినీ ఇబ్బంది పెట్టాలని కాదంటూ తెలిపింది.
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఇంద్రజ 1993 సంవత్సరంలో తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. కమేడియన్ కమ్ హీరో అలీతో మొదలుకొని.. నటరత్న బాలకృష్ణ, కృష్ణ, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఇంద్రజ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత ఇండ్రస్ట్రీకి దూరమైంది. శ్రీదేవీ డ్రామా కంపెనీ ద్వారా బుల్లి తెరకు ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరిస్తుంది. ఇటీవల వచ్చిన అల్లుడు అదుర్స్, సాఫ్ట్‌వేర్ సుధీర్ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు.