జబర్దస్త్ షో కి రోజా వస్తే వెళ్ళిపోతాను అంటూ సంచలన కామెంట్స్ చేసిన ఇంద్రజ.. కారణం..?

-

బుల్లితెరపై ప్రసారమౌతున్న కామెడీ ఎంటర్టైన్మెంట్ షో జబర్దస్త్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా గత పది సంవత్సరాల నుంచి ఎంతో విజయవంతంగా ప్రసారమవుతున్న ఈ షో ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఎంతో మంది ఈ షో కి ఫిదా అవుతున్నారు.. ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అవడమే కాకుండా వారంతా కూడా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకోవడం గమనార్హం. ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమం ప్రసారమవుతున్న అప్పటినుంచి ఈ షోకి రోజా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈమెకు ఈ ఏడాది మంత్రి పదవి రావడంతో కార్యక్రమాన్ని వదిలి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు.

ఇక రోజా వెళ్లిపోవడంతో ఆ స్థానాన్ని ఇంద్రజ ఆక్రమించారు. ఇక తాజాగా ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమం లో భాగంగా రోజా గురించి ఇంద్రజ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఇక తాను రోజా కు మంత్రి పదవి రాకూడదని దేవుడిని ప్రార్థించడమే కాకుండా.. రోజా ఈ కార్యక్రమానికి తిరిగి వస్తే తాను తప్పుకుంటానని తెలపడంతో ఈ మాటలు కాస్త బాగా వైరల్ గా మారుతున్నాయి. ఈ విధంగా తాను చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఏ విధమైనటువంటి గొడవలు కూడా లేవని ఆమె స్పష్టం చేసింది. గత తొమ్మిది సంవత్సరాల నుంచి జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న రోజా ఒక లెగసీ ని క్రియేట్ చేసింది . ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఈ కార్యక్రమానికి రావాలి అనుకుంటే తన స్థానాన్ని రోజాకి వదిలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది.

అంతేకాదు ఈ విషయాన్ని ఏ వేదిక పైన అయినా సరే చెబుతాను అని ఇంద్రజ తెలిపింది . నేను జబర్దస్త్ కార్యక్రమానికి వస్తున్నాను అని రోజా తనకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే నేను రోజా స్థానాన్ని తనకు ఇచ్చి వదిలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఇంద్రజ తెలపడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news