పోస్టాఫీసు సేవలలో కొత్త మార్పులు..ఇంట్లో నుంచే ఆ సేవలు..!

-

పోస్టాఫీసు సేవలు ఎప్పటికప్పుడు ఏదొక విధంగా మారుతున్నాయి..మొన్నటివరకూ కొత్త స్కీమ్స్, బెనిఫిట్స్ ఉన్నాయి.ఇప్పుడు పోస్టాఫీసు వినియోగదారులకు మరో బెనిఫిట్ ను కేంద్ర ప్రభుత్వం అందించనుంది..ప్రస్తుతం డిజిటల్ ఎరా నడుస్తోంది. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే అన్ని సేవలూ అందుబాటులో ఉన్నట్టే నగదు బదిలీ, చెల్లింపులు అన్నీ స్మార్ట్‌ఫోన్ల ద్వారానే సాగుతున్నాయి. బ్యాంకింగ్‌ సేవల తో పాటు మరెన్నో సేవలు డిజిటల్ ద్వారానే జరుగుతున్నాయి.

అయితే,పోస్టాఫీస్ సేవలు కూడా అత్యంత సులువుగా నిర్వహించుకునేలా ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం లీడింగ్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. వాట్సాప్‌-ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ మధ్య ఈ టైఅప్ కోసం తుది ప్రయత్నాలు మొదలయ్యాయి కూడా. రికరింగ్ డిపాజిట్స్ చెల్లింపులు, సుకన్య సురక్ష యోజన, పోస్టాఫీస్‌ అకౌంట్‌లో నగదు బదిలీ వంటి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా వాట్సాప్ ద్వారానే కొనసాగించేలా ఈ ప్రతిపాదనలను రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. వాట్సాప్ ద్వారానే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో అకౌంట్ కూడా ఓపెన్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది.

ఐపీపీబీ కొత్త అకౌంట్లను దీని ద్వారానే ఓపెన్ చేసుకోవచ్చు. వాట్సాప్ -ఐపీపీబీ మధ్య ఒప్పందం కుదర్చుకోవడానికి తుది ప్రయత్నాలు సాగుతున్నాయని సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఆధార్ టు ఆధార్ ట్రాన్స్‌ఫర్స్, క్యాష్ విత్‌డ్రాయల్స్, డిపాజిట్స్, పాన్/ఆధార్ నంబర్ అప్‌డేట్స్ ఇవన్నీ కూడా వాట్సాప్ ద్వారానే నిర్వహించుకునేలా ఈ ఒప్పందం ఉంటుందని స్పష్టం చేశారు..అయితే,రెండు నెలల పాటు పైలెట్ ప్రాజెక్ట్‌గా దీన్ని చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గ్రామీణులు పెద్ద ఎత్తున పోస్టాఫీసుల మీద ఆధారపడి ఉన్నందున వారికి ఈ కార్యకలాపాలన్నింటి మీద అవగాహన కల్పించాల్సి ఉంటుందని, అదో పెద్ద టాస్క్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news