అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఆ పొగ పీల్చడం చాలా ప్రమాదం..ఇలా తప్పించుకోవచ్చు..!

-

ఈ మధ్యకాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సాధారణంగా ఏదైనా కాస్త గందరగోళం జరగగానే మనిషి అయోమయానికి గురవుతాడు. ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా కంగారులో లేనిపోని తప్పులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు. ఇంతకు ముందు పిడుగు పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం. ఈరోజు మనం అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఏం తప్పులు చేయకూడదు.. ఎలా వ్యవహరించాలో చూద్దాం.!

మంటలు అంటుకున్న సమయంలో ఆక్సిజన్ వేగంగా క్షీణిస్తుంది. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్, హైడ్రోజన్ క్లోరైడ్ వంటి విష వాయువులు పెద్ద మొత్తంలో గాల్లోకి విడుదలయ్యాయి. ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళు ఆ విషపూరిత వాయువులు పీల్చడం వల్ల ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతింటాయి. వెంటనే శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తి అవకాశం ఉంది.దీని వల్లే ఎక్కువ మంది బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. అగ్ని ప్రమాద ఘటనల్లో దాదాపు 80 శాతం మరణాలు మంటలు అంటుకొని కాకుండా విషపూరిత వాయువులు పీల్చవడం వల్ల జరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

హైడ్రోజన్ సైనైడ్: దుప్పట్లు, సిల్క్ ఫాబ్రిక్, తివాచీలు, ఉన్ని లేదా ఫర్నిచర్ వంటి గృహోపకరణాలు కాలినప్పుడు ఈ విష వాయువు విడుదలవుతుంది. కార్బన్ మోనాక్సైడ్ మాదిరిగా హైడ్రోజన్ సైనైడ్ కణజాలం, అవయవ నష్టం కారణంగా మరణానికి దారితీస్తుంది.

హైడ్రోజన్ క్లోరైడ్: పాలీ వినైల్ (ఫర్నిచర్‌లో ఉపయోగించే సమ్మేళనం) కాలినప్పుడు ఇది విడుదల అవుతుంది. హైడ్రోజన్ క్లోరైడ్ శ్లేష్మాన్ని నాశనం చేయడం ద్వారా తీవ్రమైన బ్రోన్కైటిస్‌కు కారణమవుతుంది.

పొగ పీల్చడం ఎంత శాతం దాటితే ప్రమాదం..

ఈ పొగ పీల్చడం వల్ల భిన్నమైన లక్షణాలు కనిపిస్తాయి. వ్యక్తి కార్బాక్సీహెమోగ్లోబిన్ స్థాయిలు 15% మించి ఉంటే అతనికి వెంటనే వైద్య చికిత్స అవసరం. 15%-20% మధ్య ఉన్నప్పుడు బాధితులు తలనొప్పి, గందరగోళానికి గురవుతారు. 20-40% మధ్య ఉంటే అయోమయం, వికారం, అలసట, దృష్టి మందగించడం వంటివి జరుగుతాయి. 40-60% పొగ పీలిస్తే కోమాలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. 60% మించితే మాత్రం మరణానికి దారి తీస్తుంది.

ఎవరికి ప్రమాదం?

ప్రమాద సమయంలో ఎవరు పొగ ఎక్కువగా పీల్చిన ప్రమాదం అయినప్పటికీ గుండె జబ్బులు, ఛాతీ నొప్పి, ఉబ్బసం, ఊపిరితిత్తుల సమస్య ఉన్నవాళ్ళు చాలా త్వరగా ప్రమాదంలో పడతారు. ప్రాణాపాయం వీరిలో చాలా అధికంగా ఉంటుంది.

పీల్చకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?

అగ్ని ప్రమాదంలో చిక్కుకుపోయినప్పుడు పొగ పీల్చకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం నుంచి కొంతవరకు తప్పించుకోవచ్చు.ప్రమాదాన్ని గ్రహించిన వెంటనే స్పందించాలి. బయటకి వెళ్ళే మార్గాలు చూడాలి. గదుల్లోకి వెళ్ళి తలుపులు మూసుకోవడం వంటివి అసలు చెయొద్దు…నేల మీద మోకాళ్ళు, చేతులు ఉంచి పడుకోవాలి. లేదా కిందకి వంగుతూ మోకాలిపై నడుస్తూ తప్పించుకోడానికి ప్రయత్నించాలి.

అగ్ని ప్రమాద సమయంలో మంటల్లో నుంచి వచ్చే పొగలోని విష వాయువులు పైకి వెళ్తాయి. కింద మాత్రమే మనం పీల్చగలిగే వాయువు ఉంటుంది. కనుక మీ ముఖం భూమికి దగ్గరగా ఉంటే వాటిని తక్కువగా పీల్చగలుగుతారు.. విష వాయువులు పీల్చకుండా మీ ముక్కు లేదా నోటికి అడ్డంగా మందపాటి వస్త్రం ఏదైనా పెట్టుకోవాలి.

అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశంలోని గదిలో చిక్కుకున్నట్లైతే పొగ మీ గదిలోకి రాకుండా తలుపు వేసి తడి వస్త్రం లేదా తలుపు, వెంటిలేటర్ ఫ్రేమ్‌కి టేప్ అతికించాలి. పొగ ఎక్కువగా ఉండే గదుల్లోకి అసలు వెళ్లకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news