స్ఫూర్తి: ఆవుపేడతో కాగితాలు.. అందరు నవ్వినా ఐడియా ఏ కోట్లని తెచ్చింది…!

-

చాలా మంది జీవితంలో పైకి రావడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అయితే కష్టపడే క్రమంలో ఎంతో మంది హేళన చేస్తూ ఉంటారు. ఈ ఐడియా వర్క్ అవుట్ అవ్వదు అంటూ కూడా చులకనగా మాట్లాడుతూ ఉంటారు. నిజానికి మనిషి సక్సెస్ అవ్వాలంటే ఎన్నో అవంతరాలు ఎదురవుతూ ఉంటాయి కానీ ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తూ ఉంటుంది. ఏదో ఒక సమయంలో వచ్చే ఐడియా మన భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. సక్సెస్ ని ఇచ్చే ఒక్క ఐడియా చాలు జీవితమే మారిపోతూ ఉంటుంది.

మన జీవితంలో సక్సెస్ ని ఒక ఐడియాతో పొందొచ్చు. జైపూర్ కి చెందిన బీమ్ రాజ్ శర్మ కోటి రూపాయలని ఆవు పేడ ద్వారా సంపాదించడం జరిగింది 2014లో శర్మ ఆవు పేడ ద్వారా పేపర్లను తయారు చేయాలని అనుకున్నారు ఎందుకు ఆవు పేడ ని పేపర్లు తయారు చేయడానికి వాడకూడదు అని అతనికి అనిపించింది.

ఈ విషయాన్ని అందరితో చెప్తే హేళన చేయడం మొదలుపెట్టారు వర్క్ అవుట్ అవ్వదు అని అన్నారు. కానీ రిస్క్ తీసుకున్నారు. కూతురు పెళ్లి కోసం అని దాచుకున్న బ్బులడని ఈ యూనిట్ ని ప్రారంభించడానికి ఖర్చు చేశారు. ఆవు పేడ ద్వారా పేపర్లను తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ యూనిట్ ని స్టార్ట్ చేయడానికి 30 లక్షలు వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది.

మొదట ఒక పేపర్ ని తయారు చేస్తే అది సరిగ్గా రాలేదు. అందరూ నవ్వారు కూడా. ఆరు నెలల పాటు ఈ పేపర్ ని తయారు చేయడం పై శ్రద్ధ పెట్టారు. అదే పనిగా దీనికోసం కష్టపడ్డారు. ఆఖరికి గోమూత్రం ఆవు పేడ ఉపయోగించి పేపర్లను తయారు చేశారు. రోజుకి భీమ రాజు 3 వేల షీట్లని అమ్ముతున్నారు. ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు హైదరాబాద్ లో ఈయన క్లైంట్స్ చాలా మంది ఉన్నారు. ఇలా సక్సెస్ అయ్యారు. నిజానికి ఒకరు హేళన చేశారని కానీ వర్క్ అవుట్ అవ్వదు అని అన్నా సరే మనం ఆగిపోకూడదు కష్టపడి మనం ముందుకు వెళితే కచ్చితంగా అనుకున్నది సాధించడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news