Acharya: బోయపాటి శ్రీను మార్క్ హై వోల్టేజ్ యాక్షన్..‘ఆచార్య’ ట్రైలర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి- సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఈ పిక్చర్ ట్రైలర్ ఇటీవల విడుదలై యూట్యూబ్ లో విశేష ఆదరణ పొందుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – మెగాస్టార్ చిరంజీవిల కలయిక ట్రైలర్ లో ఎక్సలెంట్ గా ఉండటం పట్ల మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ‘ఆచార్య’ ఫిల్మ్ ట్రైలర్ పైన ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ‘ఆచార్య’ పిక్చర్ ను సెన్సిబుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించినప్పటికీ ట్రైలర్ కట్ చేసింది మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నట్లుగా ఉందని కొందరు చర్చించుకుంటున్నారు. ‘ఆచార్య’ ట్రైలర్ యాక్షన్ సీక్వెన్స్ లో మెగాస్టార్ చిరు నెక్స్ట్ లెవల్ లో ఫైట్ చేసినట్లు కనబడుతోంది. రామ్ చరణ్ సైతం యాక్షన్ ఇరగదీశారు.

‘చిరుత’ పులులుగా తండ్రీ తనయులు ‘ఆచార్య’ ట్రైలర్ లో కనిపించడం పట్ల ఈ విధమైన కామెంట్స్ వినబడుతున్నాయి. అయితే, పిక్చర్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో పాటు కొరటాల శివ స్టైల్ సెన్సిబిలిటీస్, లవ్ స్టోరిస్ ఉంటాయని మేకర్స్ అంటున్నారట. రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేయగా, ‘సిద్ధ’కు ‘ఆచార్య’కు మధ్య ఉన్న సీన్స్ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని పేర్కొంటున్నారు.

తండ్రీ తనయులు ఇద్దరూ నక్సలైట్ల పాత్రలు పోషించినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. అయితే, ట్రైలర్ లో హీరోయిన్ పూజా హెగ్డేకు ప్రయారిటీ ఇచ్చారని, కాజల్ అగర్వాల్ ను అస్సలు చూపించలేదని నెట్టింట చర్చ జరుగుతోంది. సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర ఏ మేరకు ఉంటుందనేది తెలియాలంటే ఈ నెల 29న విడుదల కానున్న సినిమా చూడాల్సిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version