‘పుష్ప-2’లో అల్లు అర్జున్ లుక్ చేంజ్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ సినిమా సీక్వెల్ ‘పుష్ప-2’ షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది. దాంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప పార్ట్ వన్ ను మించి పార్ట్ టూ ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిల్మ్ లో క్యూట్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ కాగా, విలన్ గా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటించారు. ఈ సంగతులు అలా పక్కనబెడితే.. సోషల్ మీడియాలో వస్తున్న ఓ వార్త తెలుసుకుని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

‘పుష్ప-2’లో అల్లు అర్జున్ లుక్ డెఫినెట్ గా చేంజ్ అవుతున్నదని సమాచారం. ‘పుష్ప-1’ నుంచి మించిన మాస్ లుక్ ఉంటుందని తెలుస్తోంది. పుష్ప-1లో కంటే వయలెంట్ లుక్ ఇందులో ఉంటుందని టాక్. అయితే, ఈ విషయమై ఇంకా ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ‘పుష్ప-2’ స్టోరిని ‘పుష్ప-1’ ను మించి రాశాడని మేకర్స్ చెప్తున్నారు. ఇందులో రష్మిక మందనతో పాటు అల్లు అర్జున్ ల కెమిస్ట్రీ ఇంకా బాగా ఉంటుందని అంటున్నారు. ఇక విలన్ ఫహద్ ఫాజిల్, హీరో అల్లు అర్జున్ మధ్య వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి విదితమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version