దారుణం.. చ‌నిపోయిన మ‌హిళ‌ల దేహాల‌తో శృంగారం చేసిన తాలిబ‌న్లు.. అరాచ‌కం..

-

ఆప్ఘ‌నిస్తాన్ ( Afghanistan ) లో తాలిబ‌న్ల రాక్షస కాండ కొన‌సాగుతోంది. తాము ప్ర‌జ‌ల‌ను ర‌క్షిస్తామని, వారికి స్వేచ్ఛ ఉంటుంద‌ని ముందుగా దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లు తాలిబ‌న్లు మాట‌లు చెప్పారు. కానీ వారి మాట‌లు అబ‌ద్దాల‌ని తేలింది. వారు అన్ని ప్రాంతాల‌ను ఆధీనంలోకి తీసుకున్నా త‌మ నిజ స్వ‌రూపాన్ని బ‌య‌ట పెట్టారు. ఈ క్ర‌మంలోనే ఆఫ్గ‌నిస్థాన్ నుంచి పారిపోయి ఢిల్లీకి వ‌చ్చిన అక్క‌డి ఓ మ‌హిళా పోలీస్ ఆఫీస‌ర్ తాలిబ‌న్ల అకృత్యాల గురించి వివ‌రించి చెప్పింది.

 

muskan

ఆఫ్గ‌నిస్థాన్‌లో పోలీస్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేసిన ముస్కాన్ అనే మ‌హిళ అక్కడి నుంచి త‌ప్పించుకుని ఎలాగో ఢిల్లీకి చేరుకుంది. ఈ క్ర‌మంలోనే ఆమె మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ విష‌యాల‌ను వెల్ల‌డించింది. తాలిబ‌న్ల‌కు మ‌హిళ‌లు కావాల‌ని, ప్ర‌తి ఇంట్లో ఉండే మ‌హిళ‌ల‌తోనూ వారు శృంగారం చేస్తార‌ని, అంగీక‌రించ‌క‌పోతే కాల్చి మ‌రీ మృత‌దేహాల‌తో శృంగారం చేస్తార‌ని.. ఆమె తెలియ‌జేసింది.

మ‌హిళ‌ల‌కు అక్క‌డ ర‌క్ష‌ణ లేద‌ని, తాలిబ‌న్లు క‌చ్చితంగా మ‌హిళ‌ల‌ను చంపేస్తార‌ని ఆమె అభిప్రాయ ప‌డింది. గ‌తంలో పోలీసు, ఆర్మీ, వైద్య విభాగాల్లో ప‌నిచేసిన చాలా మందిని ఇప్పుడు వెదికి ప‌ట్టుకుని మ‌రీ కాల్చి చంపుతున్నార‌ని ఆమె వాపోయింది. కాగా తాలిబన్ల అరాచ‌కాల‌పై మీడియా ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల‌ను వెల్ల‌డిస్తూనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news