పెరిగిన అమెరికా వీసా ఫీజులు.. మే 30 నుంచి అమలు

-

అమెరికా వీసా ఫీజులు పెరిగాయి. మే 30వ తేదీ నుంచి కొత్త రుసుములు అమలులోకి రానున్నాయి. 2014 తర్వాత ఇప్పుడే ఫీజులు పెంచినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఎనిమిది రకాల వీసాల ఫీజులను పెంచింది.

వీటిలో పర్యాటక వీసా బి1/బి2 ఫీజు పెంచటం చర్చనీయాంశంగా ఉంది. పెంపుదల జాబితాలో విద్యార్థి (ఎఫ్‌-1) వీసా లేకపోవటం తల్లిదండ్రులకు కాస్త ఊరట కలిగించే విషయం. ఈ ఏడాదిలో అన్ని రకాల వీసాలకు సంబంధించి పది లక్షల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. వాటిలో ఇప్పటికి నాలుగు లక్షలు పూర్తి చేసినట్లు తెలిపింది.

మరోవైపు  త్వరలో విద్యార్థి(ఎఫ్‌-1)వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రతి ఏటా రెండు సీజన్లలో అమెరికాలోని విద్యా సంస్థలు ప్రవేశాలు నిర్వహిస్తుంటాయి. స్ప్రింగ్‌ సీజనుకు సంబంధించి త్వరలో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. మే నెల నుంచి ఆగస్టు వరకు విద్యార్థి వీసా దరఖాస్తులను దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు హైదరాబాద్‌, చెన్నై, ముంబయి, కోల్‌కతాలలోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయాలు అనుమతిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version