భారత్, బ్రెజిల్‌లలో కోవిడ్ కేసులు రోజు రోజుకీ విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ఇన్‌ఫెక్షియస్ డిసీజ్ ఎక్స్‌పర్ట్ టామ్ ఫ్రీడెన్ ఈ విషయంపై స్పందించారు. కరోనా ఇప్పుడప్పుడే అంతం అవుతుందని అనుకోవద్దని ప్రజలను హెచ్చరించారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఇంకా ముగియలేదు. ఎన్నో లక్షల మంది చనిపోయారు. రోజూ ఎన్నో లక్షల మందికి కోవిడ్ సోకుతోంది. కరోనా ఇప్పుడప్పుడే అంతం అవుతుందని అనుకోవద్దు. తగినంత మందికి సరిపడా టీకాలు కూడా లేవు. కనుక ప్రజలు జాగ్రత్తగా ఉండడం ఒక్కటే మార్గం. కోవిడ్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. అని టామ్ అన్నారు.
కరోనా వైరస్ ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతోంది. వైరస్ వేగంగా మార్పులు చెందుతోంది. గతంలో కన్నా ఇప్పుడు కోవిడ్ ఇంకా ప్రాణాంతకంగా మారింది. అనేక కొత్త కోవిడ్ స్ట్రెయిన్స్ పుట్టుకొస్తున్నాయి. గతంలో కన్నా కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రానున్న రోజుల్లో ఇంకా విపరీతంగా కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంది. కనుక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
కాగా భారత్‌లో శనివారం ఒక్క రోజే 4 లక్షల కొత్త కోవిడ్ కేసులు మొదటి సారిగా నమోదయ్యాయి. రానున్న రోజుల్లో రోజు వారీ కోవిడ్ కేసుల సంఖ్య 10 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.