రష్యా నుంచి డీజిల్ దిగుమతులపై ఐరోపా దేశాల నిషేధం.. కానీ..?

-

రష్యా-ఉక్రెయిన్‌ల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో సైనికులు, అధికారులతో సామాన్య ప్రజలు కూడా మరణిస్తున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం వల్ల ఇప్పటికే చాలా దేశాలు రష్యాపై ఆగ్రహంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి డీజిల్‌ దిగుమతులపై ఐరోపా దేశాలు నిషేధం విధించాయి. గతేడాది జూన్‌లోనే ఈ నిర్ణయం ప్రకటించగా ఇప్పుడు అమల్లోకి రానుంది.

శిలాజ ఇంధన అమ్మకాలతో క్రెమ్లిన్‌ భారీ లాభాలు అర్జించి… ఆ డబ్బును ఉక్రెయిన్‌ యుద్ధంలో ఖర్చు చేస్తున్నట్లు ఐరోపా దేశాలు ఆరోపించాయి. డీజిల్‌ ఇతర శుద్ధిచేసిన ముడిచమురు దిగుమతుల నిషేధంతో రష్యా ఆదాయానికి గండికొట్టాలని భావిస్తున్నాయి. జీ7 దేశాలు విధించిన ధరల పరిమితితోపాటు నిషేధం అమల్లోకి రానుందని ఐరోపా దేశాలు స్పష్టం చేశాయి. రష్యా డీజిల్‌ను దిగుమతి చేసుకోవద్దని భారత్‌, చైనాలను ఒత్తిడి చేస్తే.. అంతర్జాతీయ విపణిలో ధరలు పెరుగుతాయనీ అందుకే ఆ పని చేయట్లేదని ఐరోపా సమాఖ్య తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news