తెలంగాణ బడ్జెట్ దేశానికే మోడల్‌గా ఉంటుందని వెల్లడించారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. తన ఇంటి నుండి జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామీ దేవాలయం కు బయల్దేరిన ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు…. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అసెంబ్లీ కి బయల్దేరనున్నారు.
ఇక ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుంది.. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. కేంద్రం సహకరించకపోయినా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్.. తెలంగాణ బడ్జెట్ దేశానికే మోడల్‌గా ఉంటుందని తెలిపారు మంత్రి హరీష్ రావు. కాగా, 10.30 నిమిషాలకు శాసన సభ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు హరీష్ రావు. 4వ సారి ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 10.30 నిమిషాలకు శాసన మండలి లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి.