మస్క్ మంచోడు..అయినా నేను ట్విట్టర్ కి దూరంగా ఉంటా: డోనాల్డ్ ట్రంప్

-

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను మళ్ళీ ట్విట్టర్ లో చూడొచ్చన వారి ఆశలపై ఆయనే నీళ్లు చల్లారు.గతేడాది నుంచి ట్రంప్ పై ట్విట్టర్ ఏకపక్ష నిషేధాన్ని అమలు చేస్తోంది.దీంతో ట్రంప్ బాగా హర్ట్ అయినట్టున్నారు.తాను మళ్లీతాను మళ్ళీ ట్విట్టర్ లోకి వచ్చేది లేదని తేల్చి చెప్పారు.మరో పక్క ఎలాన్ మస్క్ మంచి వ్యక్తి అంటూ ట్రంప్ కొనియాడారు.ట్విటర్ ను మరింత మెరుగ్గా తయారురు చేస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.నేను ట్విట్టర్ లోకి వెళ్లడం లేదు..నిజాలకే కట్టుబడాలని అనుకుంటున్నాను.ఎలాన్ ట్విటర్ ను కొనుగోలు చేశాడు.ఎందుకంటే దాన్ని ఆయన మెరుగ్గా తయారు చేయగలడు.

ఆయన మంచి వాడు.కానీ నేను నిజాలనే చెప్పాలనుకుంటున్నాను.అందుకే ట్విట్టర్ లోకి వెళ్లాలని అనుకోవడం లేదు అంటూ ట్రంప్ స్పష్టం చేశారు.ట్రంప్ ఒక ట్విట్టర్లోనే అని కాకుండా ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ తదితర ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో నిషేధాన్ని ఎదుర్కొంటున్నారు.2021 జనవరి 6న రాజధానిలో అల్లర్లు చోటు చేసుకున్న తర్వాత సామాజిక మాధ్యమాల వేదికలన్నీ ట్రంప్ పై నిషేధం ప్రకటించాయి.

Read more RELATED
Recommended to you

Latest news