కేంద్ర బిందువుగా ఉన్న పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని పర్వత ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్న భారత బలగాలు తాజాగా ఉత్తరాన కూడా పాగా వేశాయి. తూర్పు లద్దాఖ్లోలి కీలకమైన ఫింగర్-4 పర్వత శిఖరాలను భారత్ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో చైనా ఆర్మీ ఘర్షణకు దిగింది. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన భారత సైన్యం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోనూ బలగాలను మోహరించింది. 3,400 కి.మీ. పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి భద్రతను పెంచింది.
నిరంతరం అప్రమత్తంగా ఉండాలని బలగాలకు సూచించింది. అలాగే అంజా జిల్లా సరిహద్దుకు పెద్ద మొత్తంలో బలగాలను తరలిస్తోంది. ప్రస్తుతం ఇరుదేశాల సైనికులు అతి దగ్గరగా ఎదురెదురుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.