ఆ నింద నుంచి కేసీఆర్ బయటకు వస్తున్నారా…?

-

తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి ఆడింది ఆట పాడింది పాట. ఏది ఎలా జరిగినా సరే కాదనే వారు లేరు ఉండరు. ఇది నిన్నటి మాట… కాని ఇప్పుడు సినిమా కాస్త భిన్నం. ఎందుకు ఏంటీ అంటే దానికి ప్రధాన కారణం బిజెపి. అవకాశం వస్తే కేసీఆర్ ని నోక్కేస్తాం, పీకేస్తాం అంటూ బిజెపి నేతలు హెచ్చరికలు చేస్తున్నారు. నొక్కేయడం పీకేయడం అనేది అంత సులువు అయితే కాదు. ఇప్పుడు తెలంగాణాలో టీఆర్ఎస్ కు తెలంగాణా సెంటిమెంట్ అనేది సహాయం అందిస్తుంది. ఆ సెంటిమెంట్ తోనే ప్రజల్లో ఆ పార్టీకి బలం ఉంది.

అందుకే కేసీఆర్ నెలకో రెండు నెలలకో మీడియా సమావేశం పెట్టినా, మూడు వచ్చినప్పుడు సమీక్షలు చేసి ఏది మాట్లాడినా సరే జనం సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో చూస్తున్నారు. సచివాలయం కూల్చివేత విషయంలో కేసీఆర్ జ్యోతిష్యం నమ్మారు అని విపక్షాలు విమర్శలు చేస్తున్నా సరే, ప్రజలు మాత్రం కేసీఆర్ ని ఒక్క మాట అనలేదు. విపక్షాలు అలాగే మాట్లాడతాయి లే కేసీఆర్ మా వాడు అనే భావనలో ప్రజలు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ భావన నుంచి ప్రజలు బయటకు వచ్చేశారు.

దానికి ప్రధాన కారణం కరోనా పరిక్షలు… కరోనా పరిక్షల విషయంలో సిఎం హోదాలో ఉన్న కేసీఆర్ ముందు నుంచి సరైన నిర్ణయాలు తీసుకోలేదు. దేశం మొత్తం ఉంది అలాగే తెలంగాణాలో కూడా ఉంది అన్నట్టు పరోక్ష వ్యాఖ్యలు చేసారు. ఇక కరోనా తీవ్రత ఏపీలో పెరుగుతున్న సమయంలో తెలంగాణాలో ఒకటి రెండు కేసులు చెప్పిన రోజులు ఉన్నాయి. అలాంటి సమయంలో కేసీఆర్ పై ప్రజల్లో నమ్మకం అనేది పోయింది. అబద్దం చెప్తున్నారు ఆయన అనే భావనకు ప్రజలు వచ్చేశారు.

ఇప్పుడు కేసీఆర్ ఆ నింద నుంచి బయటకు రావాలని ప్రయత్నం చేస్తున్నారు. కరోనా పరిక్షల విషయంలో హైకోర్ట్ జోక్యం తర్వాత టెస్ట్ లు పెంచారు. 60 వేల వరకు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతీ రోజు మూడు వేల వరకు కేసులు నమోదు అవుతున్నాయి. కేసులను తక్కువ చేసి చూపించినా సరే… ఇప్పుడు ప్రజల్లో నమ్మకం కోల్పోవడంతో జాగ్రత్తగా టెస్ట్ లు పెంచి కేసులు కూడా బయటపెడుతున్నారు. అటు అధికారులకు కూడా ఆయన స్పష్టమైన సూచనలు చేస్తూ పరిక్షల మీద దృష్టి పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news