పడవ మునిగి 17 మంది దుర్మరణం.. 70 మంది గల్లంతు

-

ఆఫ్రికా దేశాల్లో ఇటీవల తరచూ పడవ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా వలస కార్మికులు పడవ ప్రమాదాల్లో ఎక్కువగా మృతి చెందుతున్నారు. తాజాగా నైజీరియాలో పడవ మునిగిన ఘటనలో 17 మంది దుర్మరణం చెందారు. తారాబా రాష్ట్రంలోని అర్డో-కోలా జిల్లాలో నదిలో ప్రయాణిస్తున్న సమయంలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో మరో 70 మంది గల్లంతయ్యారని స్థానిక అధికారులు తెలిపారు. స్థానిక చేపల మార్కెట్ నుంచి వ్యాపారులతో తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 100 మందికి పైగా ఉన్నారని అధికారులు తెలిపారు. వారిలో 14 మందిని మత్స్యకారులు, స్థానికులు కాపాడగా.. 17 మంది మరణించారు. మరో 70కిపైగా మంది గల్లంతయ్యారు. ఘటనపై తారాబా గవర్నర్ అగ్బు కెఫాస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నదీజలాలు సంపదకు వనరుగా ఉండాలి కానీ ఇలా.. మరణాలకు వేదిక కాకూడదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version