‘పశ్చిమ దేశాలు రష్యాలో రక్తపాతాన్ని కోరుతున్నాయి’.. పుతిన్ ఫైర్

-

రష్యాలో రక్తపాతం చోటుచేసుకోవాలని పశ్చిమ దేశాలు, ఉక్రెయిన్‌ కోరుకున్నాయని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోపించారు. తిరుగుబాటు చల్లారిన తర్వాత తొలిసారి ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌ ఇచ్చిన సందేశంలో పశ్చిమ దేశాలపై తీవ్రంగా మండిపడ్డారు. తాను రక్తపాతం నివారించేందుకు చర్యలు తీసుకుని.. వాగ్నర్‌ సభ్యులకు క్షమాభిక్షను ప్రసాదించానని వివరించారు.

ఈ తిరుగుబాటు మొదలైనప్పటి నుంచి రక్తపాతం నివారించే దిశగానే తన చర్యలు ఉన్నాయని పుతిన్ తన ప్రసంగంలో తెలిపారు. రష్యన్ల దేశభక్తికి ధన్యవాదాలు చెప్పారు. రష్యన్లు తమ సోదరులను చంపుకోవడమే పశ్చిమ దేశాలకు, కీవ్‌లోని నియో నాజీలకు, దేశ ద్రోహులకు కావాలని ఆరోపించారు. పశ్చిమ దేశాలు.. రష్యా సైనికులు పరస్పరం ప్రాణాలు తీసుకోవాలని కోరుకున్నారని మరోసారి మండిపడ్డారు.

“ఏవిధమైన వ్యవస్థీకృత సంక్షోభానికి చేసే ప్రయత్నమైనా, బెదిరింపులైనా చివరకు విఫలమవుతాయని ప్రజల సంఘీభావం తెలియజేస్తోంది’’ అని పుతిన్‌ పేర్కొన్నారు. ఈ కుట్రకు కారకులపై చట్టప్రకారం చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు. కానీ, ప్రిగోజిన్‌ పేరును ఎక్కడా పుతిన్‌ ప్రస్తావించకపోవడం గమనార్హం. వాగ్నర్‌ దళ సగటు సభ్యుడు దేశభక్తుడని పొగిడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version