ఉక్రెయిన్‌పై సైనిక దాడి చేపట్టిన తర్వాత రష్యాపై అమెరికా, ఇంగ్లాండ్, పశ్చిమ దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వస్తోంది. ఈ క్రమంలో భారత్‌కు క్రూడాయిల్ కొనుగోలు విషయంలో రష్యా బంపరాఫర్ ప్రకటించింది. అత్యంత నాణ్యతతో కూడిన హై గ్రేడ్ బ్యారెల్ క్రూడాయిల్ ధరను తగ్గించి, 35 డాలర్ల వరకు డిస్కౌంట్ ఇస్తామని ముందుకొచ్చింది.
ఇక దేశీయ అవసరాల రీత్యా భారత దేశం 15 మిలియన్ బ్యారెళ్లను కొనుగోలు చేయాలని భావిస్తోంది. అంతేకాకుండా రష్యా తన ఎస్‌పీఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్‌ను ఉపయోగించనున్నట్లు పేర్కొంది. రూపాయి-రూబుల్-డినామినేటెడ్ చెల్లింపులను కూడా ఆఫర్ చేసింది. ప్రస్తుతం మాస్కో అంతర్జాతీయంగా చెల్లింపుల వ్యవస్థ స్విఫ్ట్ నుంచి నిషేధింపబడింది. దీంతో తాజాగా భారత్ తీసుకున్న చర్యతో రష్యా కరెన్నీ రూబుల్ బలపడుతోంది. దీనిపై అమెరికా, బ్రిటన్ మండిపడుతున్నాయి. వారి విమర్శలను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బదులిచ్చారు. తగ్గింపుతో కూడిన రష్యన్ చమురును కొనుగోలు చేయాలనే భారతదేశ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించారు