షాహిద్ అఫ్రిది ఓ క్యారెక్టర్ లెస్ ఫెలో: డానిష్ కనేరియా

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ పై ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా నిప్పులు చెరిగారు.తాజాగా ఏ ఎన్ ఐ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ అఫ్రిది ఓ క్యారెక్టర్ లెస్ ఫెలో అని, అబద్దాలకోరుు అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.”ఇద్దరం కలిసి చాలా ఏళ్ళపాటుు పాకిస్థాన్ కు ప్రాతినిధ్యం వహించాం.అతను కెప్టెన్ గా ఉన్నప్పుడు నన్ను ఎక్కువగా బెంచ్ కె పరిమితం చేసే వాడు.అతని మూలంగా చాలా వన్డే మ్యాచ్లకు దూరం కావాల్సి వచ్చింది.అందరూ ఆటగాళ్ళ ముందే అవమానపరుస్తూ మాట్లాడేవాడు.

అంతే కాదు నేను హిందువునని…దేశంలో నాకు చోటు లేదని..జట్టు నుంచి బహిష్కరించాలని సహచరులకు చెప్పేవాడు” అఫ్రిది మాటలను నేను ఏనాడు పట్టించుకోలేదు.క్రికెట్ పైనే దృష్టి పెట్టేవాడిని.ఎందుకంటే అఫ్రిది ఒక వ్యక్తిత్వం లేని మనిషి అని నాకు తెలుసు.జట్టులో ఉన్నంత కాలం అతను ద్వేషించినా నేను భరించే వాడిని.నేనంటే అతనికి ఎందుకు అంత అసూయ నాకు అర్థమయ్యేది కాదు.కానీ ఒక్కటి చెప్పగలను..పాకిస్థాన్ జట్టుకు ఆడడం నా అదృష్టంగా భావిస్తా..నా జీవితంలో అదో గొప్ప విషయం” అని కనేరియా చెప్పుకొచ్చాడు.