బైడెన్​పై అభిశంసన విచారణకు స్పీకర్​ అనుమతి

-

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు గట్టిషాక్ తగిలింది. ఆ దేశ ప్రతినిధుల సభ స్పీకర్‌ కెవిన్‌ మెక్‌కార్తి జో బైడెన్‌పై అభిశంసన విచారణకు  అనుమతించారు. అధికారిక అభిశంసన విచారణ ప్రారంభించాలని హౌస్‌ కమిటీని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌.. తన కుమారుడు హంటర్‌ విదేశీ వ్యాపార లావీదేవీలను దాచిపెట్టాడనే ఆరోపణలు వచ్చాయి.

దీనిపై శ్వేత సౌధం స్పందిస్తూ.. ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ అత్యంత దారుణమైన రాజకీయాలు చేస్తోందని విమర్శించింది. హౌస్‌ ఆఫ్‌ రిపబ్లికన్లు 9 నెలల నుంచి అధ్యక్షుడిని విచారిస్తున్నారని, అయినా తప్పు జరిగినట్లు ఆధారాలు చూపలేకపోయారని వైట్ హౌస్ ప్రతినిధి ఇయన్‌ సామ్స్‌ తన సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేశారు.

డెమోక్రాట్‌ పార్టీకి చెందిన బైడెన్‌ కుమారుడు హంటర్‌.. ఉక్రెయిన్‌కు చెందిన ఇంధన కంపెనీలో డైరెక్టర్‌గా పని చేశారు. ఆ సంస్థ నుంచి బైడెన్‌లకు ముడుపులు ముట్టాయని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బైడెన్‌ను అభిశంసించాలని ట్రంప్‌ డిమాండ్ చేస్తున్నారు. గతంలో ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డెమోక్రాట్లు రెండుసార్లు అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టగా.. ఇప్పుడు దానికి ప్రతీకారంగా బైడెన్‌ను అభిశంసించాలని ట్రంప్‌ పట్టుబడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version