స్టాక్‌ మార్కెట్లలో వ్యాక్సిన్ జోష్..వచ్చే ఏడాది కూడా లాభల్లో కొనసాగుతాయన్న పోల్స్‌..

-

భారత స్టాక్‌ మార్కెట్లలో కరోనా వ్యాక్సిన్ జోష్ కనిపిస్తుంది..గత వారంలో రోజుల్లో భారీ లాభల్లోకి వచ్చాయి షేర్‌ మార్కెట్లు..త్వరలోనే మార్కెట్లలోకి వ్యాక్సిన్ వస్తున్నందన్న వార్తల నేపథ్యంలో లాభల్లో కొనసాగుతున్నాయని రాయిటర్స్ పోల్ ప్రకటించింది..వచ్చే ఏడాది కూడా మార్కెట్లు లాభల్లోనే కొనసాగుతాయని రాయిటర్సట్ పోల్స్‌లో వెల్లడైంది..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా సేకండ్, మూడో దశ కొనసాగుతుంది..చాలా దేశాల్లోని మార్కెట్లు కరోనాతో ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి..చాలా దేశాల తమ ఆర్థిక వ్యవస్థ క్షీణ దశలో ఎన్నాయి..అయితే గత కొద్దీ రోజులుగా కరోనా వ్యాక్సిన్‌ పై వస్తున్న సానుకూల వార్తలతో భారత మార్కెట్లు లాభల్లో దూసుకుపోతున్నాయి..వచ్చే ఏడాదిలో కూడా భారతదేశం యొక్క స్టాక్ మార్కెట్లు లాభల్లోనే కొనసాగుతుందని ఈక్విటీ స్ట్రాటజిస్టులు రాయిటర్స్ పోల్‌లో తెలిపారు..అంతే కాకుండా 2021లో మార్కెట్లుల కొత్త రికార్డు సృష్టిస్తాయని..లాభాలు స్థాయికి చేరుకుంటాయని ప్రకటించింది.కరోనా నేపథ్యంలో వచ్చిన నష్టాలను తిరిగి వస్తాయని పోల్ నివేదిక తెలిపింది..నవంబర్ 12 నుంచి 24 వరకూ రాయిటర్స్ పోల్ 35కి పైగా ఈక్విటీ స్ట్రాటజిస్టుల అభిప్రాయాలను తీసుకుంది..వారి అంచనా ప్రకారం ప్రస్తుతం రికార్డు స్థాయిలో ట్రేడవుతున్న బిఎస్ఇ సెన్సెక్స్ ఇండెక్స్ వచ్చే ఏడాదిలో కొత్త ఆల్-టైమ్ శిఖరాలను నెలకొల్పుతుందని తెలినట్లు నివేదించింది..2021 మధ్య నాటికి గరిష్టంగా 3% పెరుగుతుందని..2021 చివరి నాటికి ఇది మరో 4% పెరుగుతుందని అంచనా వేశారు ఈక్విటీ స్ట్రాటజిస్టులు.

మార్చిలో వచ్చిన కరోనా మహమ్మారి వల్ల గ్లోబల్ స్టాక్ మార్కెట్లు చాలా నష్టపోయాయి.. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలలో లోతైన మార్పులు వచ్చాయి..అనేక దేశాల ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లాయి..ఇప్పుడు ఆయా దేశాలు బిలియన్ల డాలర్ల ప్రభుత్వం యొక్క ఆర్థిక, ద్రవ్య ఉద్దీపనల ద్వారా ఆర్థిక పునరుద్ధరణ కోసం ఎదురు చుస్తున్నాయి..ఆసియా యొక్క మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్-జూన్లో దాదాపు పావు శాతం తగ్గిపోతున్నప్పటికీ, ఇది అంచనా కంటే చాలా ఘోరంగా ఉందన్నారు ఆర్థిక రంగ నిఫుణులు.

ఆర్థిక వ్యవస్థ యధాస్థితికి రావడానికి సుదీర్ఘ కాలం పడుతుందని పోల్ నివేదిక సూచిస్తుంది..భారతదేశం కొన్ని సంవత్సరాల క్రితం వరకు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ..కరోనా దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ అతాలకుతలం అయ్యింది..భారత్ స్థూల జాతీయోత్పత్తి ప్రీ-కోవిడ్ నాటి స్థాయిలను చేరుకోవడగానికి ఒక సంవత్సరానికి పైగా పడుతుందని అంచనా వేసింది.

కార్పొరేట్ ఆదాయాలు ప్రీ-కోవిడ్ స్థాయిలకు ఎప్పుడు తిరిగి వస్తాయో అడిగినప్పుడు, 32 మంది వ్యూహకర్తలలో 28 మంది సంవత్సరం లోపు పడుతుందని చెప్పారు..10 మంది మాత్రం వచ్చే ఆరు నెలల్లో ఆర్థిక వ్యవస్థ గాడిలోకి వస్తుందని చెప్పారు..కరోనా సమయంలో ఆదాయాలు తగ్గిపోవడంతో కంపెనీలు లాభాలను కాపాడటానికి ఖర్చులను కూడా తగ్గించుకుంటాయని ఈక్విటీ స్ట్రాటజిస్టుల అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news