ప్రపంచ వ్యాపంగా ఎన్ని కరోనా కేసులంటే..?

-

కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచం అంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఈ మహమ్మారి దెబ్బకి ప్రభుత్వాలకి, ప్రజలకి కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. ఇకపోతే తాజాగా.. ప్రపంచ వ్యాప్తంగా గత 24 గంటల్లో 2 లక్షల 23 వేలకుపైగా కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 72 లక్షలకి చేరింది.

కరోనాతో 3,918 మంది చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 8 లక్షల 87 వేలకి పెరిగింది. రికవరీ కేసులు 1.93 కోట్లు ఉండగా, యాక్టివ్ కేసులు 70.30 లక్షలకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 4 శాతంగా కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news