పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే (సెప్టెంబర్ 2) సందర్భంగా ఆయన నటిస్తున్న తొలి పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ నుంచి గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. అది చూసి ఆయన అశేష అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డెఫినెట్ గా ఈ పిక్చర్ రికార్డులు అన్నిటినీ తిరగరాస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, పవన్ కల్యాణ్ తన కెరీర్ లో ఇతర హీరోల కంటే చాలా భిన్నంగా ఉంటూ రికార్డు సృష్టించారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫిల్మ్ కెరీర్, మూవీస్ స్టోరిస్ సెలక్షన్ స్పెషల్ స్టోరి..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సినిమాల్లో యువతకు స్ఫూర్తినిచ్చే పాటలను పెడుతుంటారు. బలమైన పాత్రలతో పాటు కుదిరినంత మేరకు సమాజానికి స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు.
ఇకపోతే ఇప్పటి వరకు హీరోలు అందరూ సినీ చరిత్రలో నెగెటివ్ పాత్రలు పోషించినప్పటికీ పవన్ కల్యాణ్ మాత్రం ఆ పాత్రలు పోషించలేదు. పాజిటివ్ బిహేవియర్ ఉన్న రోల్స్ మాత్రమే పవన్ కల్యాణ్ తన సినిమాల్లో ప్లే చేశారు.
ఇతర హీరోలతో పోల్చితే పవన్ కల్యాణ్ ..తన సినిమాల్లో డిఫరెంట్ గా కనబడేలా ప్రయత్నించారు. దాంతో పాటు పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు నటించిన సినిమాలన్నిటిలో ఒక్క సినిమాలో కూడా ఆయన పాత్ర చనిపోయేలా చేయలేదు. అలా తన సినీ కెరీర్ లో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు పవన్.
పవన్ కల్యాణ్ ప్రజెంట్ చేస్తున్న ‘హరిహర వీరమల్లు’తో పాటు ‘భవదీయుడు భగత్ సింగ్’, ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’ చిత్రాల్లో కూడా తన పాత్ర స్ఫూర్తిదాయకంగా ఉండేలా చూసుకుంటారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ గత చిత్రం ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషీయుమ్’కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ పిక్చర్ కు సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించారు.