IPL 2022 : చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై అమిత్ మిశ్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

-

ఐపీఎల్ చ‌రిత్ర‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యాల‌పై అనేక రికార్డులు ఉన్నాయి. ఐపీఎల్ ట్రోఫీ ని నాలుగు సార్లు ముద్దాడిన చెన్నై సూప‌ర్ కింగ్.. ప్ర‌తి సీజ‌న్ లో అద్భుతంగా రాణిస్తుంది. అయితే ఈ ఐపీఎల్ 2022 లో మాత్రం చెన్నై సూప‌ర్ కింగ్స్ దారుణంగా విఫ‌లం అవుతుంది. వ‌రుస‌గా మూడు మ్యాచ్ లో ఓడిపోయి పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌ర నుంచి మూడో స్థానంలో ఉంది. చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఓడిపోవ‌డంపై అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సీనియ‌ర్ ఆట‌గాళ్లు కూడా చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌రస‌గా విఫ‌లం అవ‌డంపై ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

కొంత మంది సీనియ‌ర్ ఆట‌గాళ్లు.. చెన్నై సూప‌ర్ కింగ్స్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కూడా చేస్తున్నారు. తాజా గా ఇండియ‌న్ బౌల‌ర్ అమిత్ మిశ్రా కూడా చెన్నై పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ట్విట్ట‌ర్ లో ఒక వ్య‌క్తి.. చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టులోకి రావాల‌ని పోస్టు చేశాడు. దీనిపై స్పందించిన అమిత్ మిశ్రా.. దానికి ఇంకా త‌న‌కు రెండు సంవ‌త్స‌రాల వ‌య‌స్సు త‌క్కువ‌గా ఉందంటూ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతుంది. కాగ చెన్నై జ‌ట్టులో అంద‌రూ వ‌య‌స్సు మ‌ళ్లిన ఆట‌గాళ్లే ఉంటార‌నే వాద‌న ఉంది. కాగ అమిత్ మిశ్రా గ‌తంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్, డెక్క‌న్ ఛార్జ‌ర్స్, స‌న్ రైజ‌ర్స్ త‌రపున ఆడాడు. ఇటీవ‌ల జ‌రిగిన మెగా వేలంలో అమిత్ మిశ్రాను ఎవ‌రూ కొనుగోలు చేయలేదు.

Read more RELATED
Recommended to you

Latest news