IPL 2022 : స‌రి కొత్త‌గా.. గుజ‌రాత్ టైటాన్స్ లోగో

-

ఐపీఎల్ 2022 కి అన్ని ఫ్రొంఛైజీలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే మెగా వేలం కూడా విజ‌య వంతంగా పూర్తి అయింది. కొన్ని ఫ్రొంఛైజీలు ఇప్పకే.. జెర్సీలు మార్చుకున్నాయి. అలాగే ఈ ఏడాది నుంచి కొత్త‌గా ఐపీఎల్ కు ఎంట్రీ ఇస్తున్నా.. అహ్మ‌దాబాద్, ల‌క్నో లు కూడా ఐపీఎల్ 2022 కు స‌ర్వం సిద్ధం చేస్తున్నాయి. లక్నో జ‌ట్టు ఇప్ప‌టికే.. త‌మ జ‌ట్టు పేరును, జెర్సీని లోగోను ప్ర‌క‌ట‌న చేసింది. అలాగే అహ్మ‌దాబాద్ ఫ్రొంఛైజీ కూడా త‌మ జ‌ట్టు పేరును.. గుజ‌రాత్ టైటాన్స్ అనే పేరుతో భ‌రిలోకి దిగ‌నుంది.

కాగ తాజా గా గుజ‌రాత్ టైటాన్స్ అధికారిక లోగోను విడుద‌ల చేసింది. ఇప్ప‌టి వర‌కు ఉన్న ఐపీఎల్ ఫ్రొంఛైజీ లగా కాకుండా భిన్నంగా త‌మ లోగోను విడుద‌ల చేసింది. మెటావ‌ర్స్ లో త‌మ జ‌ట్టును లోగోను గుజ‌రాత్ టైట‌న్స్ విడుద‌ల చేసింది. దీంతో గుజ‌రాత్ టైటాన్స్ అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. కాగ గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టులో కెప్టెన్ గా హార్ధిక్ పాండ్య ఉన్నాడు. శుభ్ మాన్ గిల్ తో పాటు ప‌లువురు ప్ర‌ధాన ఆటగాళ్లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version