ఐపీఎల్ 2023 ఫైనల్: చెన్నై VS గుజరాత్… టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోని !

-

ఈ రోజు ఎంతో ఉత్కంఠగా జరగనున్న ఐపీఎల్ సీజన్ 16 ఫైనల్ లో నాలుగు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మరియు రెండవ సీజన్ మాత్రమే ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ లు తలపడనున్నాయి. ఇప్పటి వరకు ఈ సీజన్ లో ఈ రెండు జట్లు మూడు సార్లు తలపడగా రెండు సార్లు గుజరాత్ టైటాన్స్ గెలవడం విశేషం. కాగా ఇప్పుడు టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ టీం కెప్టెన్ ధోని మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ క్వాలిఫైయర్ 2 లోనూ మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ జట్టు పరుగుల వరద పారించింది. ఈ మ్యాచ్ లోనూ బ్యాటింగ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్న గుజరాత్ మళ్ళీ భారీ స్కోర్ చేస్తుందా ?

ఈ రోజు రాత్రి కూడా గిల్ పూనకం వచ్చినవాడిలా ఆడి చెన్నై ను దెబ్బ తీస్తాడా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కావాలంటే మ్యాచ్ స్టార్ అయ్యే వరకు ఆగాల్సిందే. కాగా ఈ రోజు జరగనున్న మ్యాచ్ లో పిచ్ ఎవరికి అనుకూలిస్తుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version