IPL 2024 : పోరాడి ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్… స్టబ్స్ ఇన్నింగ్స్ వృధా

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 20 వ మ్యాచ్ ముంబైలోని వాంఖాడే స్టేడియం వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ ఓపెనర్స్ లో డేవిడ్ వార్నర్ తక్కువ స్కోర్ కి అవుట్ కాగా, మరో ఓపినర్ పృద్విషా 66 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అభిషేక్ పోరెల్ 41 పరుగులు చేశాడు. ట్రిస్తన్ స్టబ్స్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు. కానీ మరో వైపు మిగతా బ్యాటర్లు విఫలం అవ్వడంతో ఢిల్లీ ఓటమిపాలు అయ్యింది.

 

కాగా, మొదటగా బ్యాటింగ్ కి దిగిన ముంబై ఇండియన్స్ బ్యాట‌ర్లు చిత‌క్కొట్టారు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ల‌కు ప‌ట్ట ప‌గ‌లే చుక్కలు చూపించారు. ఇక ముంబై ఓపెనర్లు ఇషాన్ కిష‌న్‌(44),రోహిత్ శ‌ర్మ‌(49) మొదటి వికెట్ కి 80 పరుగులు జోడించి శుభారంభాన్ని ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడు టిమ్ డేవిడ్(45 నాటౌట్‌), రొమారియో షెప‌ర్డ్‌(39 నాటౌట్‌)లు చివ‌ర్లో వీరవిహారం చేశారు. దాంతో ముంబై 5 వికెట్ల న‌ష్టానికి 234 పరుగులు చేసింది.ఢిల్లీ క్యాపిటల్స్ బౌల‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్ , అన్రిచ్ నోకియాలు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version