IPL Auction : నేడు రెండో రోజు ఐపీఎల్ వేలం.. ఫ్రొంఛైజీల వ‌ద్ద డ‌బ్బు ఎంతంటే?

-

ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు విజ‌యవంతంగా ముగిసింది. ప్లేయ‌ర్ల అనౌన్స్ చేసే ఎడ్మీడ్ డ‌యాస్ కు గుండె పోటు రావ‌డంతో కుప్ప‌కూలరు. దీంతో అతన్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం కామెంట‌ర్ చారు శ‌ర్మ వేలం నిర్వ‌హ‌క బాధ్య‌త‌లు తీసుకున్నాడు. కాగ తొలి రోజు ఫ్రొంఛైజీలు ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం కురిపించాయి. తొలి రోజు లక్నో సూప‌ర్ జాయింట్స్ ఏకంగా రూ. 52.10 కోట్లు వెచ్చించి.. 11 మంది ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. దీంతో ఇంకా ప‌ర్స్ లో కేవ‌లం రూ. 6.90 కోట్లు మాత్ర‌మే ఉన్నాయి.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రూ. 49.85 కోట్లు ఖ‌ర్చు చేసి 11 మందిని కొనుగోలు చేసింది. ఆర్ఆర్ వద్ద ఇంకా.. రూ. 12.15 కోట్లు ఉన్నాయి. స‌న్ రైజ‌ర్స్ రూ. 47.85 కోట్లతో 13 మందిని ద‌క్కించుకుంది. ఇంకా రూ.20.15 కోట్లు ఉన్నాయి. బెంగ‌ళూర్ రూ.47.75 కోట్ల‌తో 11మందిని కొనుగోలు చేసింది. ఇంకా రూ. 9.25 కోట్లు ఉన్నాయి. పంజాబ్ రూ. 43.35 కోట్ల‌తో 11 మందిని ద‌క్కించుకుంది. ఇంకా రూ. 28.65 కోట్లు ఉన్నాయి. కోల్‌క‌త్త రూ.35.35 కోట్ల‌తో 9 మందిని తీసుకుంది. ఇంకా రూ.12.65 కోట్లు ఉన్నాయి. గుజ‌రాత్ రూ. 33.15 కోట్ల‌తో 10 మందిని కొనుగోలు చేసింది. ఇంకా రూ. 18.85 కోట్లు ఉన్నాయి.

ఢిల్లీ రూ. 31 కోట్ల‌తో 13 మందిని ద‌క్కించుకుంది. ఇంకా రూ. 16.50 కోట్లు ఉన్నాయి. చెన్నై రూ. 27.55 కోట్ల‌తో 10 మందిని తీసుకుంది. ఇంకా రూ. 20.45 కోట్లు ఉన్నాయి. ముంబై అత్య‌ల్పంగా కేవలం రూ. 20.15 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేసింది. 8 మందిని కొనుగోలు చేసింది. ఇంకా రూ. 27.85 కోట్లు ఉన్నాయి. కాగ తొలి రోజు యంగ్ ప్లేయ‌ర్ల వైపే చూసిన ఫ్రొంఛైజీలు.. ఈ రోజు సీనియ‌ర్, విదేశీ ఆట‌గాళ్లపై కాసుల వ‌ర్షం కురిపించ‌నున్నాయి. ఈ రోజు కూడా మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఈ మెగా వేలం ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news