ఏపీలో టికెట్ ధరలు, సినిమా రంగ సమస్యలపై ఇటీవల సినీ ప్రముఖులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, నారాయణ మూర్తి మొదలైన వారు సీఎం జగన్ లో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం టికెట్ ధరల ఇష్యూ దాదాపుగా ముగిసిపోయింది. నెలఖరులో జీవో కూడా వస్తుందనే అభిప్రాయాన్ని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే… ఈ భేటీపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ అయితే ఏకంగా… సినీ హీరోలంతా జీరోలయ్యారని.. ఏపీ సీఎం ముందు భిక్షాటన చేశారని ఘాటుగా విమర్శించారు. ఇదిలా ఉంటే సీనియర్ యాక్టర్ నరేష్ కూడా ఈ భేటీపై స్పందించారు. సీఎం జగన్ తో భేటీ అభినందనీయం అని, ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో పరిశ్రమ ప్రయోజనాల కోసం ఓ వర్క్ షాప్ పెట్టడం అవసరం అని.. ఇండస్ట్రీ ఐక్యల ప్రతిభింబించేలా ప్రజాస్వాయ్య బద్దంగా చర్చలు జరిపి అధికారికంగా తీర్మాణం చేయాలని.. త్వరలో ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ జరుగుతుందని ఆశిస్తున్నా అంటూ ట్విట్ చేశాడు.