తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ చేపట్టింది పోలీస్ శాఖ. దాదాపు 60 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. అయితే.. హైదరాబాద్ , రాచకొండ, సైబరాబాద్ పరిధిలో మెజారిటీ డీసీపీలు బదిలీ అయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ నెల మొదటి వారంలో కూడా.. పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 29 మంది సీనియర్ అధికారులను వివిధ హోదాల్లో బదిలీ చేస్తూ.. మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు అధికారులను నియమించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అదనపు డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.