తక్కువ ధరకే కేరళ టూర్ ప్యాకేజీ.. ఈ ప్రదేశాలన్నీ చూసి వచ్చేయండి..!

-

IRCTC ఎన్నో రకాల టూర్ ప్యాకేజీలని తీసుకువచ్చింది. IRCTC తీసుకువచ్చిన ఈ టూర్ ప్యాకేజీల ద్వారా మంచిగా టూర్ వేసి వచ్చేయచ్చు. అందులోనూ వేసవికాలం సెలవులు మొదలవుతున్నాయి పిల్లలకి సెలవులు ఉన్నప్పుడే ప్రయాణాలు చేయడం మంచిది మళ్ళీ సెలవు కావాలంటే కుదరదు. ఐఆర్సిటిసి కేరళకి కూడా ఒక ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీ తీసుకువచ్చింది కేరళ చూడడానికి చాలా బాగుంటుంది. అక్కడ ప్రకృతి సోయగాలు అందరినీ బాగా ఆకట్టుకుంటాయి. కేరళలోని వివిధ ప్రాంతాలని చూడచ్చు. కేరళ వెళ్లాలనుకునే వాళ్లు ఈ టూర్ ప్యాకేజీ ద్వారా ఈజీగా కేరళ వెళ్లి వచ్చేయొచ్చు.

కేరళ హిల్స్ అండ్ వాటర్స్ పేరిట ఈ ప్యాకేజీ తీసుకువచ్చింది మే 9 నుండి జూన్ 27 వరకు ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. తెలుగు రాష్ట్రాల నుండి రైలు వెళుతుంది. గుంటూరు నల్గొండ సికింద్రాబాద్ తెనాలి రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కచ్చు. కేరళ ప్రయాణం ముగించుకున్నాక మళ్ళీ అదే రైల్వే స్టేషన్ లో దిగొచ్చు. మొత్తం ఇది ఐదు రాత్రులు ఆరు పగళ్ళు టూర్ ప్యాకేజీ మే 9 నుండి వారానికి ఒకసారి సికింద్రాబాద్ నుండి ట్రైన్ వెళ్తుంది. మే 9 16 23 30 ఈ విధంగా జూన్ 27 దాకా శబరి ఎక్స్ప్రెస్ లో ప్రతి మంగళవారం ప్రయాణం ఉంటుంది.

ఈ ట్రైన్ సికింద్రాబాద్లో మొదటి రోజు మొదలవుతుంది రెండో రోజు మధ్యాహ్నానికి మీరు ఎర్నాకులం రైల్వే స్టేషన్ కి రీచ్ అవుతారు. అక్కడినుండి మున్నార్ కి తీసుకెళ్తారు. ముందుగానే బుక్ చేసుకున్న హోటల్లో స్టే చేయాల్సి ఉంటుంది. అక్కడ విశ్రాంతి తీసుకుని రాత్రి మున్నార్ హోటల్లో ఉండాలి. మూడో రోజు నేషనల్ పార్క్, టీ మ్యూజియం, ముట్టుపెట్టి డ్యామ్ వంటివి చూడొచ్చు. నాలుగవ రోజు అల్లేపి చూడొచ్చు. అల్లెపీ అందాలు చూసి మీరు అక్కడ సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. ఐదో రోజు అల్లేఫై నుండి ఎర్నాకులం రైల్వే స్టేషన్ కి రీచ్ అవుతారు. మధ్యాహ్నం అక్కడ ట్రైన్ ఎక్కితే మరుసటి రోజు అంటే ఆరవ రోజు మధ్యాహ్నం సికింద్రాబాద్ చేరుకుంటారు యాత్ర ముగుస్తుంది.

ఈ ప్యాకేజీ ధర విషయానికి వస్తే సింగిల్ షేరింగ్ ఒక్కొక్కరికి 32,230 రూపాయలు ట్విన్ షేరింగ్ 18,740 గా వుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీ కి 15,130 చెల్లించాల్సి ఉంది. ఎంచుకున్న ప్యాకేజ్ ని బట్టి రైల్లో ప్రయాణం ఉంటుంది ప్యాకేజీని బట్టి ఏసీ వాహనం ఉంటుంది. గదులు, ఉదయం అల్పాహారం ఫ్రీగానే. మధ్యాహ్నం భోజనం టూరిస్టులు పెట్టుకోవాలి అలానే రాత్రి డిన్నర్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. పర్యటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ప్రయాణికుల చెల్లించాలి పూర్తి వివరాలను మీరు ఐఆర్సిటిసి వెబ్సైట్లో చూసి ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version