నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇరిగేషన్ శాఖలో 700 పోస్టులు..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణలోని ఇరిగేషన్ శాఖ (Irrigation Department) పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

తెలంగాణలోని సాగునీటి శాఖ పరిధిలో తొలి విడతలో 700 పోస్టులు భర్తీ చేసేందుకు ఆ శాఖ అధికారులు రెడీగా వున్నారు. ఈ పోస్ట్స్ లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పోస్టులు 568, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు 132 వుంటాయని చెబుతున్నారు.

అయితే వీటికి భర్తీకి సంబంధించిన ఫైలు ప్రభుత్వానికి చేరినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు ఇప్పటికే శాఖ పునర్వ్యవస్థీకరణ చేసి కొత్త డివిజన్‌లు ఏర్పాటు చేశారు.

ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ స్థాయి నుండి పలు వాటిలో 378 పోస్టులని భర్తీ చేశారు. ఈ పదోన్నతులతో పాటు ఖాళీగా ఉన్న ఇతర పోస్టులు కలిపి మొత్తంగా శాఖ పరిధిలో 1,167 ఖాళీలున్నట్లు ఇరిగేషన్‌ శాఖ గుర్తించింది.

ఏఈఈ పోస్టుల్లో సివిల్‌కు సంబంధించి 310, మెకానికల్‌ 58, ఎలక్ట్రికల్‌ 200 ఉండనున్నాయి. అయితే ఈ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ ఇంకా రాలేదు. త్వరలోనే పూర్తి వివరాలతో నోటిఫికేషన్ ని విడుదల చేస్తారు. కనుక నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news