నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా..?

-

సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా సరే నంబర్ వన్ హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు ?డైరెక్టర్ ఎవరు? అని చాలా వరకు చూస్తారు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా నెంబర్ వన్ అనే విషయం చాలా తక్కువ మంది మాత్రమే చూస్తారు. అయితే మ్యూజిక్ డైరెక్టర్లకు కేవలం టాలీవుడ్ లోనే కాదు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. వారు అందించే సంగీతం ప్రేక్షకులకు వినసొంపుగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ సంగీతం వల్లే సినిమా కూడా విజయం సాధిస్తుందని చెప్పవచ్చు. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్లుగా కెరియర్ కొనసాగిస్తున్న వారు భారీ స్థాయిలో పారితోషకం కూడా తీసుకుంటూ నెంబర్ వన్ అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఈ మ్యూజిక్ డైరెక్టర్లలో మరి ఎవరు నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనే ప్రశ్నకు సమాధానాలు రకరకాలుగా వినిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు టాలీవుడ్ లో దేవిశ్రీప్రసాద్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే మారుతున్న కాలంతో పాటే దేవి శ్రీ ప్రసాద్ మారడం లేదు. గత కొన్నేళ్లుగా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇచ్చిన సినిమాలలో మెజారిటీ సినిమాల మ్యూజిక్ పై విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఈయన డైరెక్టర్ సుకుమార్ సినిమాలకు మాత్రమే పనిచేస్తున్నారు.

మరోపక్క ఏ ఆర్ రెహమాన్ వరుస విజయాలను సొంతం చేసుకొని ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అయితే గతంలోకి తొంగి చూస్తే.. ప్రస్తుతం ఆయన హవా ఇప్పుడు తగ్గింది. అయితే తమిళంలో మాత్రం అనిరుధ్ హవా కొనసాగుతూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే తెలుగులో థమన్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా తమిళంలో అనిరుధ్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. మరి రాబోయే రోజుల్లో కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు వస్తారా? లేక వీళ్ళలోనే పోటీ పెరిగి స్థానాలు మారుతాయా? అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version