చిరులాంటి స్టార్లు ఆమె ను చూసి ఫిదా అవుతుంటారు.. నాని లాంటి హీరోలు ఆమెతో నటించి పోటీ పడుతుంటారు. చై లాంటి కుర్రాళ్లు మాత్రం ఇంకా తాము ఆమెతో పోటీ పడలేం అని కూడా అంటుంటారు. మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి త్వరలో ఓ ఇంటిది కానుందా? పెళ్లితో తన కెరియర్ ఆగిపోనుందా? ఈ న్యూస్ మానియాలో నిజాలు లేవు .. ఉన్నాయో లేదో తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లండిక.
పింపుల్ బ్యూటీ సాయి పల్లవికి సంబంధించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఆమె పెళ్లి నిశ్చయం అయిందన్న వార్త తెగ ట్రోల్ అవుతోంది. ఇందులో వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో తెలియకపోయినా నెటిజన్లు మాత్రం ఈ వార్తను చదివి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యాన ఆమె గురించి ఇంకొంత… డ్యాన్సర్ గా పరిచయమై తన లోని టాలెంట్ ని నిరూపించి, ఫిదా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల మనసును దొచుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి.. ఆ సినిమా ఘన విజయాన్ని అందుకోవడంతో వరుస సినిమాలలో నటించే ఛాన్స్ కొట్టేసింది.
ఆ తర్వాత వరుస సినిమాలలో కనిపించి జనాలను మెప్పించింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే స్కిన్ షో అవసరం లేదని నిరూపించి ఎందరికో ఆదర్శం అయింది. ఇదే సమయాన హీరోలతో సమానంగా పాత్రలను చేసిన ఘనత కూడా ఆమెకే దక్కుతుంది. టాలీవుడ్ లో యంగ్ హీరోల సినిమాలకు ప్లస్ గా మారుతున్న సాయిపల్లవి ప్రతిభను చూసి , ఫిదా అయి అగ్ర కథనాయకులు కూడా తెగ పొగుడుతున్నారు.
ఇదే సమయంలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా హై రేంజ్ లో ఉంది. ఈ మధ్యనే డైరెక్టర్ సుకుమార్ పుణ్యమాని లేడీ పవర్ స్టార్ అన్న ట్యాగ్ లైన్ కూడా యాడ్ అయింది. ఇంత ఫేమస్ అయినప్పటికీ ఈ అమ్మడు చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదని తెలుస్తుంది. స్టార్ హీరో లతో నటించిన ఇమేజ్ వున్న పల్లవి ఎందుకు సినిమాలను ఎంచుకోవడం లేదనే సందేహం అందరికి రావడం సహజం. సాయి పల్లవి తెలుగులో నటించిన చివరి సినిమా విరాటపర్వం ఒక్కటే. విడుదలకి సిద్ధంగా ఉన్నా ఈ సినిమా తర్వాత మరే సినిమాకి కమిట్ అవలేదు.
అంటే త్వరలో పెళ్లి పీటలెక్కపోతుందని అందుకే కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ సన్నిహితులు మాత్రం అలాంటిది ఏమి లేదని తోసిపుచ్చారు. సినిమాల ఎంపిక, స్క్రిప్ట్ విషయంలో సాయి పల్లవి పక్కాగా ఉండే ఈ హీరోయిన్. మంచి కథ తన దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేస్తోందని అంటున్నారు. పెళ్ళి గురించి మీడియా గతంలో చాలాసార్లు అడిగితే నా ఏజ్ జస్ట్ 29 మాత్రమే ఇంక పెళ్ళికి టైం ఉందని చెప్పి తప్పించుకుంది. అప్పుడే పెళ్ళి ఏంటి అంటూ చెబుతూనే పెళ్ళి పీటలు ఎక్కిన హీరోయిన్లు ఉండటంతో అందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి! సాయి పల్లవి ఆ విధంగా చేస్తుందా?