కవిత రాజకీయం..కేసీఆర్‌కు కలిసొస్తుందా?

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఓ వైపు కవిత ఈడీ విచారణ ఎదురుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్కామ్ లో కవిత పాత్ర ఎంత వరకు అనేది ఈడీ తేల్చనుంది. ఇప్పటికే ఒకసారి ఈడీ కవితని విచారించింది..మార్చి 11న కవితని 9 గంటల పాటు విచారణ చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పుడే ఆమె అరెస్ట్ ఖాయమని మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ ఆమె అరెస్ట్ జరగడలేదు.

ఈడీ విచారణ తర్వాత ఆమె బయటకొచ్చేశారు…హైదరాబాద్ కు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు మరొకసారి కవిత ఈడీ విచారణని ఎదురుకోబోతున్నారు. కానీ ఈ లోపు ఆమె మహిళా రిజర్వేషన్లు అంటూ పోరాటం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడం మంచి విషయమే. కానీ ఇన్ని రోజులు ఆమె ఎందుకు పోరాటం చేయడం లేదు. ఈడీ విచారణకు ముందే ఎందుకు పోరాటం చేస్తున్నారా? అంటే అందులో రాజకీయం ఏంటో క్లియర్ గా అర్ధమైపోతుంది.

మొదట్లో తెలంగాణ కేబినెట్ లో కనీసం మహిళలకు స్థానం ఇవ్వనప్పుడు కవిత..తన తండ్రి, సి‌ఎం కే‌సి‌ఆర్‌ని ఎందుకు ప్రశ్నించలేదు. అసలు ముందు తమ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని పోరాదకుండా..ఢిల్లీకి వచ్చి మహిళల కోసం పోరాటమని హడావిడి చేయడం వెనుక రాజకీయం లేకుండా ఉండదు. మొదట మార్చి 11న ఈడీ విచారణ ఉంటే..మార్చి 10న కవిత మహిళా రిజర్వేషన్ల కోసం విపక్ష పార్టీలతో దీక్షకు దిగారు.

ఇక మార్చి 16న ఈడీ విచారణ ఉంటే..మార్చి 15న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. అయితే ఇదంతా కే‌సి‌ఆర్ డైరక్షన్ లోనే నడుస్తున్న విషయం తెలిసిందే. మరి కవిత చేస్తున్న పోరాటం…కే‌సి‌ఆర్ కు రాజకీయంగా ఉపయోగపడుతుందా? అంటే పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పవచ్చు. ఎందుకంటే క్లియర్ గా ఈడీ విచారణ ముందే ఈ పోరాటం ఎత్తుకున్నారు. కాబట్టి దీని వల్ల రాజకీయంగా కూడా ఒరిగేది ఏమి లేదనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news