ప్రధాన మంత్రి వయ వందన యోజన కి ముగియనున్న గడువు… ఇలా సులభంగా దరఖాస్తు చేసేయండి..!

-

కేంద్రం మన కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. వీటి వలన ఎన్నో లాభాలని పొందొచ్చు. ఆర్థికంగా ఎదిగేందుకు వివిధ రకాల స్కీమ్‌లను కేంద్రం తీసుకు వస్తూనే వుంది. పెన్షనర్లకు పెన్షన్ స్కీమ్స్ ని కూడా తీసుకు వచ్చింది. వాటిలో ప్రధాన మంత్రి వయ వందన యోజన కూడా ఒకటి. దీనిలో లబ్ధిదారునికి పెన్షన్‌ హామీ ఇస్తారు. 26 మే 2020న దీన్ని ప్రారంభించారు. 31 మార్చి 2023లోపు దరఖాస్తు చేసేందుకు ఛాన్స్ వుంది.

pensioners
pensioners

60 ఏళ్లు పూర్తి అయ్యాక భార్యాభర్తలిద్దరూ పెన్షన్ తీసుకోవచ్చు. వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ పెన్షన్ ని పొందొచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని నిర్వహిస్తుంది. గరిష్టంగా రూ.15 లక్షల వరకు దీనిలో పెట్టచ్చు. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటే ఈ స్కీమ్ కి అర్హులే.

వార్షిక వడ్డీ 7.40 శాతం ఇస్తారు. వార్షిక పెన్షన్ రూ.51 వేలు. ప్రతీ నెలా పెన్షన్ కావాలంటే రూ.4100 ని పొందొచ్చు. రూ.1.62 లక్షలు పెట్టుబడి పెడితే నెలకి వెయ్యి వస్తాయి. గరిష్టంగా రూ.9250 పెన్షన్ పొందవచ్చు. అప్పుడు రూ.15 లక్షలు పెట్టుబడిగా పెట్టాలి.

ఈ పాలసీ ని ఎలా తీసుకోవాలి..?

ఇక ఎలా ఈ పాలసీ ని పొందచ్చనేది చూస్తే.. కనీస వయస్సు 60 సంవత్సరాలు ఉండాలి.
అలానే భారతీయ పౌరుడై ఉండాలి. ఈ పాలసీ కోసం వన్ టైమ్ ప్రీమియం చెల్లించాలి. ప్రధాన మంత్రి వయ వందన యోజన కోసం 31 మార్చి 2023లోపు దరఖాస్తు చేసేందుకు ఛాన్స్ వుంది. ఆ తరవాత కుదరదు. LIC ఆఫీస్ కి వెళ్లి ఈ పాలసీ ని పొందొచ్చు. లేదంటే ఆన్ లైన్ లో LIC అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి పాలసీ సెక్షన్ లో ఈ పాలసీ ని ఎంచుకుని మీరు అప్లై చేసేయచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news