ప్రభాస్ పెళ్లి పై వస్తున్న వార్తలు నిజమేనా..?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ మోస్ట్ బ్యాచిలర్స్ గా పేరు పొందారు. వివాహం చేసుకోకుండా ఉన్నారు. ఇక ఆయన అభిమానులు సైతం ఈ హీరో పెళ్లి ఎప్పుడు అవుతుందా అంటూ పదే పదే అడుగుతూ ఉంటారు. చివరికి ప్రభాస్ పెళ్లి విషయంలో తన పెద్ద నాన్న కృష్ణం రాజు కూడా ఒకానొక సమయం సందర్భం లో విసుగు వచ్చి.. ఈ విషయం ప్రభాస్ నే అడగండి అంటూ తెలియజేశారు. దీంతో కొన్ని మీడియా కథనాలు మాత్రం మొగల్తూరు అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ అవన్నీ ఒట్టి పుకార్లే గానే మిగిలిపోయాయి. అయితే ప్రస్తుతం ప్రభాస్ వయస్సు 40 సంవత్సరాలు. దీంతో ఈయన పెళ్లి ప్రయత్నాలు చాలా సీరియస్గా సాగుతున్నాయి అనే వార్త ఇప్పుడు బాగా వైరల్ గా మారుతుంది. ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారుతోంది. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ ఏడాది కచ్చితంగా వివాహం చేసుకుంటారని ఎంతో కాన్ఫిడెంట్ గా తెలియజేశారు కృష్ణంరాజు.

ఈ విషయాన్ని కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సైతం చెప్పడంతో ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామానికి చెందిన అభిమాన సంఘం అధ్యక్షుడు ఈ విషయాన్ని తెలపడంతో మరింత ఆసక్తి రేపింది. ఈ పెళ్లి గురించి కృష్ణం రాజు స్పందించిన తర్వాత ఫ్యాన్స్ ప్రెసిడెంట్ వ్యాఖ్యానించడంతో ప్రభాస్ పెళ్లి నిజంగానే జరుగుతుందని బలమైన సంకేతాలు అందుతున్నాయి. అయితే ఆ అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన అమ్మాయిగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ ఏడాది.. నవంబర్ నెలలో వివాహం చేసుకోబోతున్నారని టాక్ బాగా వినిపిస్తోంది. మరి ఈ వార్తలు అన్నీ కూడా నిజాలు కావాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ విషయం పై ప్రభాస్ కుటుంబం నుంచి ఏదైనా వార్త వినిపిస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version