పూరీ,ఛార్మీ లపై వస్తున్న వార్తలు నిజమేనా..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బద్రి సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకున్న పూరీ జగన్నాథ్ ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు పనిచేసి హీరోలను కూడా స్టార్ హీరోలుగా తీర్చిదిద్దాడు.. ఇక కష్టాల్లో వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న హీరోలకు మంచి విజయాలను అందించి స్టార్ హీరోలు గా మార్చిన ఘనత కేవలం పూరీ జగన్నాథ్ కు మాత్రమే దక్కుతుందని చెప్పవచ్చు. ఇక పూరీ జగన్నాథ్ ఒకవైపు దర్శకుడిగా పని చేస్తూనే మరొకవైపు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టిన విషయం తెలిసిందే.Wagging tongues can't be stopped: Charmi Kaur

అయితే ఈ క్రమంలో ని నిర్మాణ బాధ్యతల్లో భాగంగా ఛార్మీ ని కూడా సహనిర్మాత చేసిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరూ కూడా నిర్మాణ విభాగంలో.. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసే ప్రతి సినిమాకు ఛార్మీ నిర్మాత గా వ్యవహరిస్తోంది. ఇక ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్లడం ..ఒకేచోట జీవించడం లాంటివి చేస్తూ ఉండడం వల్ల వీరిద్దరిపై పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పూరీ జగన్నాథ్ .. ఛార్మీ వ్యామోహంలో పడి సొంత భార్య లావణ్య కు అన్యాయం చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. అంతేకాదు లావణ్య కు విడాకులు ఇచ్చి ఛార్మీ ని వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు రోజురోజుకి వైరల్ అవుతూ ఉండడంతో ఈ విషయంపై ఆకాష్ స్పందించాడు.Go and marry him Puri Jagannadh wife suggestion to Charmi

ఆకాష్ మాట్లాడుతూ.. ఛార్మీ కేవలం సినిమాలకు సంబంధించిన నిర్మాణ బాధ్యతలు మాత్రమే తీసుకుంటుంది. నాన్నకు ఛార్మితో ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదు. కేవలం వారు సినిమాల పరంగా మాత్రమే కలిసి ఉంటారు . ఇక ఒక సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే దర్శకుడికి, ప్రొడ్యూసర్ కి మంచి అవినాభావ సంబంధం ఉంటుంది. ఇక అలాంటి బంధమే నాన్నకు ఛార్మీ గారికి మధ్య వుంది. ఇందులో తప్పుగా భావించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్న అమ్మను వదిలి చార్మీ దగ్గరకు వెళ్లి పోరు. అమ్మ అంటే నాన్నకు చాలా ఇష్టం.. నాన్న దగ్గర జేబులో వంద రూపాయలు ఉన్న సమయంలోనే కట్టుబట్టలతో నాన్న కోసం అమ్మ వచ్చింది. ఇక ఆ కృతజ్ఞత భావం నాన్నకు ఇంకా ఉంది. కాబట్టే అమ్మను మోసం చేయడు అంటూ క్లారిటీ ఇచ్చాడు ఆకాష్ పూరీ.

Read more RELATED
Recommended to you

Latest news